ఆకట్టుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’ టైటిల్ ట్రాక్….!!

0
439

సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా జోడిగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ప్రతిరోజు పండగే’. ప్రముఖ నటుడు సత్యరాజ్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సినిమాలోని ఒక సందర్భంలో కుటుంబమంతా కలిసి ఎంతో ఆనందంగా కలిసి మెలిసి పాడుకునే ఈ పాటకు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఆకట్టుకునే ట్యూన్ ని అందించగా, కేకే అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చడం జరిగింది. ఇక అందరిని ఎంతో అలరించే విధంగా యువ గాయకుడు శ్రీకృష్ణ గాత్రం, పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో శ్రోతలను విశేషంగా అలరిస్తూ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. కుటుంబంలో బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా జయకుమార్ పని చేస్తుండగా, సహా నిర్మాతగా ఎస్ కె ఎన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here