దీపావళి శుభాకాంక్షలతో నాగ శౌర్య అశ్వద్ధామ టైటిల్ పోస్టర్ విడుదల

0
1349

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్‌ను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

ఉషా ముల్పూరి మాట్లాడుతూ… ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.3 టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కోసం పండ‌గ‌రోజు ఛ‌లో సెంటిమెంట్‌తో మిమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌లవ‌డం జ‌రిగింది. నాగ‌శౌర్య‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అశ్వ‌థ్థామ‌ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశాము. టాకీ పార్ట్ మొత్తం పూర్త‌యింది. ఈ చిత్రానికి ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్‌.లో కొన్ని ఇంగ్లీష్ మూవీస్‌కి వ‌ర్క్ చేశారు. ఛ‌లో చిత్రం నుంచి శౌర్య‌తో క‌లిసి ట్రావెల్ చేశాడు. క‌థ శ‌ర్య రెడీ చెయ్య‌గా వీరిద్ద‌రు క‌లిసి ఈ చిత్రానికి వ‌ర్క్ చేశారు. డి.ఒ.పి.మ‌నోజ్‌రెడ్డి కూడా యు.ఎస్‌.లో వ‌ర్క్ చేశారు. త‌ను కూడా ఒక సంవ‌త్స‌రం నుంచి మాతో క‌లిసి ప‌ని చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌చ‌ర‌ణ్‌పాకాల, ఎడిట‌ర్ గ్యారీ గ‌తంలో క్ష‌ణం, గూఢాచారి, ఎవ‌రు చిత్రాల‌కు ప‌ని చేశారు. మేమంద‌రం క‌లిసి ఒక టీమ్ వ‌ర్క్‌లా ప‌ని చేసి మంచి అవుట్‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. కె.జి.ఎఫ్ చిత్రానికి స్టంట్స్‌ చేసిన అన్‌భైర‌వ్ మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. మూవీకి సంబంధించి యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక్క పాట మిన‌హా షూట్ మొత్తం పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రిలో ఆ సాంగ్ మీ ముందుకు తీసుకొస్తాం.

శంక‌ర్‌ప్ర‌సాద్ మాట్లాడుతూ… ప్రొడ‌క్ష‌న్ నెం.3 అశ్వ‌ధామ షూటింగ్ పార్ట్ ఈ నెల 27తో పూర్త‌యింది. ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. దీనికి ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శౌర్య‌తో క‌లిసి ఛ‌లో చిత్రంతో జ‌ర్నీ చేస్తున్నారు.శౌర్య ఒక రియ‌ల్ ఇన్సిడెంట్‌ని స్టోరీగా చేసుకుని ఆ స్టోరీని క‌థ‌గా మార్చుకుని ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో చెయ్య‌టం జ‌రిగింది. దాదాపుగా యాక్ష‌న్ సీన్ల‌న్నీ ముప్పైరోజులు షూట్ చేశాము. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌చేద్దామ‌నుకుంటున్నాము.

డైరెక్ట‌ర్ ర‌మ‌ణ‌తేజ మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. శౌర్య ఒక రియ‌ల్ ఇన్సిడెంట్స్ తీసుకుని దాని ఆధారంగా క‌థ‌ను రాసుకున్నారు. నేను ఆయ‌న‌తో క‌లిసి ఛ‌లో చిత్రం నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయ‌న ఈ క‌థ‌కు న‌న్ను ద‌ర్శ‌కుడుగా అనుకున్నందుకు నాకు చాలా గ‌ర్వంగా ఉంది. నా ఫ‌స్ట్ మూవీ ఇంత మంచి మూవీ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఐరా క్రియేష‌న్స్ ఒన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్టాండ‌ర్డ్స్‌కి ఎక్క‌డా త‌క్కువ లేకుండా నేనేమ‌డిగినా నాకు అన్నీ ఇచ్చారు. ప్రొడ‌క్ష‌న్‌లో నాకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదు. నేను క‌థ‌మీదే పూర్తి కాన్‌స‌న్‌ట్రేట్ చేశాను. మ‌ధ్య‌లో కొంత ఇబ్బంది ప‌డ్డాం. వైజాగ్‌లో శౌర్య కాలికి దెబ్బ త‌గ‌ల‌డం చాలా బాద‌ప‌డ్డాం. డూపు, మాస్ట‌ర్స్‌, మేము చెప్పాం కానీ విన‌కుండా చేశారు. కంప్లీట్‌గా నేనే చేస్తాను అని చేశారు. అంటే ఆయ‌న క‌థ‌లో అంత‌గా లీన‌మ‌యిపోయారు. ఈ సినిమాకి ఇదే క‌రెక్ట్ అని చేశారు. ఆయ‌న ఎంతో క‌సిగా మ‌ళ్ళీ తిరిగి రిక‌వ‌ర్ చేసుకుని త్వ‌ర‌గా సినిమా కంప్లీట్ చేసుకున్నాం. నేను ఒక నాలుగు ఇంగ్లీష్ మూవీస్ కి వ‌ర్క్ చేశాను. ఆ ఎక్స్‌పీరియ‌న్స్‌తోనే ఇక్క‌డ వ‌ర్క్ చేశాను. శౌర్య‌గారు మా ఫ్రెండ్‌షిప్ మీద అవ‌కాశం ఇచ్చారు. బుజ్జిగారు నాకు బాగా స‌పోర్ట్ చేశారు. ఆన్‌లైన్ సెట్‌లోనే ఒక ఎడిట‌ర్‌ని ఇచ్చారు. గ్యారీ కూడా కంప్లీట్ మూవీ అంతా మాతో క‌లిసి ప‌ని చేశారు. ఉద‌యం వ‌చ్చి సాయంత్రం వెళ్ళేవారు. రాసుకున్న క‌థ‌ను బాగా తీశాం అనుకుంటున్నాం. ఈ చిత్రంలో శౌర్య పాత్ర ఎలా ఉండ‌బోతుందంటే ప్ర‌తి ఇంట్లో ఒక శౌర్య ఉంటాడు. ప్రాప‌ర్ ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న చిత్రం. మ‌హాభార‌తంలో అశ్వ‌ధామ పాత్ర చాలా ఉంటుంది. అందులోంచి మేము ఒక్క సీన్ మాత్రం తీసుకున్నాం. నిండు స‌భ‌లో ద్రౌప‌ది వ‌స్తాభ‌ర‌ణం జ‌రిగే సీన్ తీసుకున్నాం. కౌర‌వులు సైడ్ ఉన్నా స‌రే పాండ‌వులు ఎవ్వ‌రూ ఇది త‌ప్పు అని చెప్ప‌రు ఒక్క అశ్వ‌ధాముడు త‌ప్పించి అందువ‌ల్లే కృష్ణుడు ఎప్ప‌టికి త‌న చావును రాయ‌లేదు. ఇప్ప‌టికీ చిరంజీవిలానే ఉన్నారు. ఎవ్వ‌రూ అడ‌గ‌ని దానిని నా హీరో అడుగుతున్నారు. ఈ మూవీలో కామ‌న్‌గా ఉంటే యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటుంది. క‌థ‌ప‌రంగా త‌ప్పించి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఏమీ ఉండ‌దు. ఈ చిత్రంలో కెజిఎఫ్ ఫైట్ మాస్ట‌ర్స్ చాలా డిఫ‌రెంట్ రియ‌లిస్టిక్ ఫైట్స్ ఉంటాయి. మొత్తం 4 పాటులు ఉన్నాయి.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఎడిట‌ర్ గ్యారీ, డిఒపి మ‌నోజ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here