వారిద్దరి జీవితాల స్ఫూర్తితోనే ‘గుడ్‌లక్‌ సఖీ’ కథ పుట్టింది – దర్శకుడు నగేష్‌ కుకునూర్‌

0
1311

‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘డోర్‌’, ‘ఇక్బాల్‌’ వంటి ఫీచర్‌ ఫిల్మ్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు దర్శకుడు నగేష్‌ కుకునూర్‌. ఇప్పుడు తెలుగులో కీర్తి సురేష్‌ ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలలో షూటింగ్ నేపథ్యంలో ‘గుడ్ లక్ సఖీ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్‌ కుకునూర్‌ మీడియా తో ముచ్చటించారు.ఆ వివరాలు…

ఈ ఇండస్ట్రీ లోకి మీప్రయాణం ఎలా మొదలైంది?
– బేసిక్ గా నేను హైదరాబాదీనే. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. కానీ మా డాడీ యూఎస్ లో జాబ్ చేయడం వలన నేను అక్కడే పెరిగాను. సినిమా తీయాలని ఇండియా కి వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. మా డాడీ నిర్మాత, నేను డైరెక్టర్, యాక్టర్, మా ఆంటీ కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా కుటంబం మొత్తం కలిసి1998లో ‘ హైదరాబాద్ బ్లూస్’ పేరుతో నా మొదటి ఫీచర్ ఫిల్మ్ తీసాం.

ఇన్నేళ్ల కెరీర్ లో మీరు సాధించిన అఛీవ్మెంట్ ఏంటి?
– నేను 15 వరకు ఫీచర్ ఫిల్మ్స్ తీయడం జరిగింది. అలాగే ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో చేసిన వెబ్ సిరీస్ ఈ ఏడాది హాట్ స్టార్లో ప్రసారం ఐయ్యింది. ఐతే ఒక ఫుల్ టైం కమర్షియల్ మూవీ తీసిన ప్రతి సారి పెద్ద అఛీవ్మెంట్ లా భావిస్తాను.

మీ ఫీచర్ ఫిలిమ్స్ లో ఎన్ని విజయం సాధించాయి?
– హానెస్ట్ గా చెవుతున్నాను..,నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను తీసిన మా టెక్నికల్ టీం తో కలిసి మూవీ ఫస్ట్ కాపీ చూస్తాను. ఒక సారి వారందరూ ఓకే అన్నాక ఇక ఆ
మూవీ గురించి నేను పట్టించుకోను. న్యూస్ చూడను, ఆర్టికల్స్, మూవీ రివ్యూస్ కూడా చదవను.

స్టార్ హీరోలెవరైనా మీతో మూవీస్ చేయడానికి ముందుకు వచ్చారా?
– ఏ డైరెక్టర్ కైనా కూడా ఏదో ఒక సమయంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశే అవకాశం దక్కుతుంది. నేను కూడా పదేళ్ల క్రితమే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాను. ఐతే నేను స్టార్ హీరోలతోనే మూవీస్ చేయాలనుకోను, స్క్రిప్ట్ కి తగ్గట్టుగా క్యాస్టింగ్ ని ఎంచుకుంటాను. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదని నేను బాధపడలేదు, అందుకోసం ఇప్పటి వరకు నేను పరిగెత్తలేదు.

తెలుగు వారైన మీరు తెలుగులో మూవీ చేయకపోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు?
– నేను హైదరాబాద్ అబ్బాయినైనా తెలుగు మాట్లాడగలనుకానీ చదవడం రాయడం రాదు. హిందీ మాత్రం నాకు చదవడం రాయడం వచ్చు.  మాతృభాషలో సినిమాలు చేయలేకపోవడానికి ఇదీ ఒక కారణం.  నేను నా సినిమా డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ లోనే రాస్తాను వాటిని మా రైటర్స్ తో కూర్చొని వేరే భాషల్లోకి అనువాదం చేస్తాం. నా ఒపీనియన్ లో భాషమీద పట్టు లేకుండా మూవీ చేయకూడదు అనుకున్నాను.  కానీ, ఇప్పుడు ఇతర భాషల దర్శకులు కూడా తమకు సంబంధం లేని భాషల్లో సినిమాలు తెరకెక్కించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది.  ఎట్టకేలకు కీర్తితో తెలుగులో ఓ సినిమా చేయడం సంతోషాన్నిస్తోంది

కీర్తితో మీరు చేస్తున్న మూవీ ఏ జోనర్?
– ఇదొక క్రీడా నేపథ్యం కలిగిన రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్‌ 10 మీటర్స్‌ పిస్టల్‌ షూటర్‌గా కనిపిస్తుంది. ఆమె తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె చాలా అందమైన నటి. చాలా కూల్ గా ఉంటుంది. ఆమెతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆడవాళ్ళ గురించి మంచి సందేశం కూడా ఉంటుంది.

ఈ చిత్రం చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా?
– రిషికేష్ ముఖర్జీ ,విశ్వనాధ్ గారు ఈ చిత్రం తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తి అని చెప్పాలి.
ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్‌ల షూటింగ్‌ ఫొటోను 20ఏళ్ల క్రితం ఓ పేపర్‌లో చూశా. దాన్ని కత్తిరించుకోని భద్రపరచుకున్నా. వాళ్లిద్దరి జీవితాల స్ఫూర్తితోనే నా మనసులో ఈ కథ పుట్టింది.ముఖ్యంగా రిషికేష్ ముఖర్జీ గారి సినిమాలను తలపించేలా ఈ మూవీ టేకింగ్ ఉంటుంది.

ఆది, జగపతి బాబు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
– ఇప్పుడే పూర్తి సమాచారం ఇవ్వలేను అయితే.. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ రంగస్థల నటుడి పాత్రను పోషిస్తున్నారు. జగపతిబాబు కీర్తి కోచ్‌గా చేస్తున్నారు. దీన్నొక రామెడీ అని చెప్పొచ్చు. అంటే రొమాంటిక్‌ కామెడీతో కూడుకొని ఉన్న స్పోర్ట్స్‌ డ్రామా.

తెలుగు సినిమాలు మీరు ఏవి చూశారు?
నేను కేవలం తెలుగులో మాహానటి చిత్రం చూశాను. అది కూడా యూఎస్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే చూశాను. అప్పుడే ఈ మూవీకి కీర్తిని ఎంపిక చేసుకోవడం జరిగింది.

మీకు రిషికేష్ ముఖర్జీ మీ రోల్ మోడల్ అన్నారు, మోడరన్ రిషికేష్ ముఖర్జీ అనిపించుకోవాలనుకుంటున్నారా ?
– ఖచ్చితంగా..,గతంలో నాకు ఒకరు ఆ కంప్లీమెంట్ కూడా ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నాకు తెలిసి హిందీలో రిషికేష్ ముఖర్జీ, తెలుగులో విశ్వనాధ్ గారిని మించిన దర్శకులు లేరు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
– తర్వాతి ప్రాజెక్టులపై ఇంకా ఏమీ నిర్ణయించులేదు. ప్రస్తుతానికి నా దృష్టంతా ఈ సినిమాను పూర్తి చేయడంపైనే ఉంది. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తయింది. పూర్తిగా వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుతున్నాం. ఇంకో 25 రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి నిర్మాతల సాయంతో విడుదల తేదీని ప్రకటిస్తాం..అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here