ఇటీవల ‘2.0’ మరియు ‘పెట్టా’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రస్తుతం మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాస్కరన్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో రజిని, ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా యూనిట్ నేడు రజినీకాంత్ స్టైలిష్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. రజినికాంత్ గన్ పట్టుకుని స్టైలిష్ గా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. సంతోష్ శివన్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది…!!


