సరిలేరు నీకెవ్వరు.. దీపావళి డబుల్ ధమాకా

0
540

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రిలీజైన పోస్టర్స్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి అంటే బజ్ ఏ రేంజ్ ల్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ డోస్ ఈ దీపావళికి మరింత పెరగనుంది. ఎందుకంటే చిత్ర యూనిట్ డబుల్ ధమాకా అనిపించే పోస్టర్స్ ని రెడీ చేసింది.

సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సంబంధించిన ఒక స్పెషల్ లుక్ ని శనివారం ఉదయం 9:09 గంటలకి విడుదల చేయబోతున్నారు. ఇక సేమ్ డే ఈవినింగ్ సూపర్ స్టార్ న్యూ పోస్టర్ ని రివీల్ చేయడానికి సిద్దమయ్యారు. కరెక్ట్ గా శనివారం సాయంత్రం 5:04 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

దిల్ రాజు – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మహేష్ GMB ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమా నిర్మాణంలో బాగమవుతోంది. మహేష్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ రాజేంద్రప్రసాద్ బండ్ల గణేష్ వంటి నటులు కీలకపాత్రలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here