చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తొలిసారి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఆదిత్య వర్మ. ఈ-4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ముఖేష్ మెహతా నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు గిరిసాయా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు అర్జున్ రెడ్డి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నూతన నటి బనిత సందూ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.
ఇకపొతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్, రేపు అధికారికంగా రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ప్రియా ఆనంద్ మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ధృవ్ కు స్నేహితుడిగా అన్బు తసన్ నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన దానిని క్యాన్సిల్ చేసి, రెండోసారి తెరకెక్కించడం జరిగింది. కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!


