జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానున్న అజయ్ దేవగన్ పీరియాడిక్ డ్రామా ‘తన్హాజీ’….!!

0
571

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా ఓం రవుత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోగ్రఫికల్ పీరియాడిక్ డ్రామా మూవీ ‘తన్హాజీ’. టి సిరీస్ మరియు అజయ్ దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. శివాజీ మహారాజ్ తో కలిసి మరాఠా ప్రజల కోసం పోరాడిన సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే, 1670 వ సంవత్సరంలో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించడం జరిగింది.

అటువంటి గొప్ప యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, మరొక నటుడు సైఫ్ అలీ ఖాన్ మరియు నటి కాజోల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శరద్ కేల్కర్ ఛత్రపతి శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు షీలార్ మామ అనే పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేయికో నకహర ఫోటోగ్రఫీని అందిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here