క్లాసిక్ రీమేక్ తో సిద్దమవుతున్న సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ

0
845

ఫ్యామిలీ అండ్ సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ వంటి యూనిక్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఈ సీనియర్ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గులాబీ దర్శకుడు చివరగా 2017లో నక్షత్రం ఆమె సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక రెండేళ్ల అనంతరం మరో సినిమాకు సంబంధించిన స్పెషల్ ఏనౌన్స్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒక మరాఠీ కథను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేయబోతున్నాడు. అందులో ప్రకాశ్ రాజ్ – రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. 2016లో మరాఠీలో తెరకెక్కిన నట్ సామ్రాట్ మంచి విజయాన్ని అందుకుంది. నాటకాలకు రిటైర్మెంట్ ఇచ్చిన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నిజ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటు తన పాత రంగస్థల జ్ఞాపకాలను మరచిపోలేకపోతుంటాడు. అదే సినిమా ఎమోషనల్ పాయింట్.

మరాఠీలో నానా పటేకర్ పోషించిన పాత్రను ప్రకాష్ రాజ్ తెలుగులో ప్రజెంట్ చేయబోతున్నారు. అభిషేక్ J – మధు కలిపు ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే రంగమార్తాండ సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా రోజుల తరువాత కృష్ణవంశీ ఒక స్పెషల్ కథతో రాబోతుండడంతో ఈ ప్రాజెక్ట్ ఆడియెన్స్ ని తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. నానా పటెకర్ నటవిశ్వరూపంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. మరి తెలుగులో ప్రకాష్ రాజ్ రంగమార్తాండను ఏ స్థాయికి తీసుకువెళతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here