టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలను పూరి అందిస్తుండగా అనిల్ పాదూరి తొలిసారి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ‘రొమాంటిక్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇక నేడు హఠాత్తుగా ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదని, కాకపోతే కొంతవరకు సినిమా కోసం వేసిన సెట్ మాత్రం దగ్ధం అయినట్లు సమాచారం. ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!


