మల్టీ టాలెంటెడ్ వుమెన్ మంచు లక్ష్మి ప్రస్తుతం ఒక డిఫరెంట్ షోతో వెబ్ వ్యూవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ అనే షో ద్వారా సౌత్ ఇండియన్ స్టార్స్ ని ఊహించని ప్రశ్నలు అడుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు. ఇటీవల కొంతమంది టాలీవుడ్ స్టార్స్ అలాగే కోలీవుడ్ హీరోయిన్స్ ని మంచు లక్ష్మి తో చిట్ చాట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు యువ హీరో నిఖిల్ కూడా వినూత్న శైలిలో షోలో దర్సనమిచ్చే సరికి ప్రోమో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది, మంచు లక్ష్మి అడిగిన బోల్డ్ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన ఫిట్ నెస్ ని ప్రజెంట్ చేశాడు. అలాగే తనతో అర్జున్ సురవరంలో నటించిన లావణ్య త్రిపాఠి బ్యూటిఫుల్ గర్ల్ అంటూ సెట్ లోకి ఆమె రాగానే అందరూ ఆమెనే చూస్తారని మాట్లాడాడు. అలాగే తన పెళ్లిపై కూడా నిఖిల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోమవారం వూట్ వెబ్ ఛానెల్ లో ప్రసారం కానున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ గ నిఖిల్ రాబోతున్నాడు అని అతనితో షో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మంచు లక్ష్మి చెప్తున్నారు. ఇక ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే వాయిదాపడుతూ వస్తోన్న అర్జున్ సురవరం సినిమాను కూడా నిఖిల్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.


