పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహపంక్తి భోజనం, వైరల్ అవుతున్న పిక్

0
3099

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిద్వార్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి మాత్రి సదన్ లో మూడు రోజులుగా బస చేసిన పవన్, ఆ ప్రాంతంలోని గంగానది పరివక ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రామన్‌ మగసిస్ అవార్డు గ్రహీత మరియు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాజేంద్ర సింగ్ సహా మరికొందరితో పవన్ నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత అక్కడి ఆశ్రమ వాసులతో కలిసి ఆకులలో సహపంక్తి భోజనం చేసిన పవన్, నేడు హైదరాబాద్ కు తిరుగు పయనమవనున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్, అక్కడివారితో కలిసి ఎంతో సాదాసీదాగా సాధారణ వ్యక్తిలా సహపంక్తి భోజనం చేస్తున్న ఆ పిక్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతోంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here