బాక్స్ ఆఫీస్ వద్ద వార్ @ 150

0
6208

బాలీవుడ్ యాక్షన్ హీరోలు మొత్తానికి దసరా సెలవులను గట్టిగానే ఉపయోగించుకుంటున్నారు. మొదటిసారిగా టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ తో కలిసి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఈ ఇద్దరి హీరోల కెరీర్స్ కి ఈ సినిమా మర్చిపోలేని కలెక్షన్స్ ని అందించిందని చెప్పవచ్చు.

మూడురోజుల్లోనే 100కోట్ల కలెక్షన్స్ ని అందుకున్న వార్ 5రోజుల్లో మరో మార్క్ ని అందుకుంది. 150కోట్ల కలెక్షన్స్ తో ఈ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ ఈ యాక్షన్ సినిమాని తెలుగులో కూడా భారీగానే రిలీజ్ చేసింది. ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అవకాశం ఉన్న ప్రతిచోటా సినిమా స్క్రీన్స్ ని కూడా పెంచుతున్నారు.

దీంతో సినిమా 5రోజుల్లోనే 150కోట్లను అందుకుంది. ఈ వారం కూడా కలెక్షన్స్ నెంబర్స్ పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. చూస్తుంటే 200కోట్ల మార్క్ ని దాటేందుకు సినిమాకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు. వాని కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here