జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నయనతార గజినీ సినిమా నుంచి అదే ఫ్లోలో వెళుతోంది. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడపుడు ఫోటో షూట్స్ తో అలరించే ఈ బ్యూటీ రీసెంట్ గా మరోసారి ఎట్రాక్ట్ చేసింది. ప్రముఖ మ్యాగజిన్ వోగ్ కవర్ పేజ్ పై అందాలతో మెరిసిపోతోంది. సోషల్ మీడియాలో నయన్ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు గ్లామర్ తో ఎటాక్ చేసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతోంది.
ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కనిపించి మరోసారి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలతో రెడీ అవుతోంది. విజయ్ తో నటించిన బిగిల్ సినిమా ఈ దీపావళికి రిలీజ్ కానుంది. ఇక సూపర్ స్టార్ రజినీతో నటించిన దర్బార్ కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా దర్బార్ తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల కాబోతోంది.