మెగాస్టార్ చిరంజీవి హిస్టారికల్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి విడుదల కావడానికి సమయం దగ్గరపడుతోంది. అభిమానులు అక్టోబర్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో చిత్ర యూనిట్ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో బ్రిటిష్ రాజులను కూడా దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా చూపించినట్లు తెలుస్తోంది.
అయితే అందులో 7 ముఖ్యమైన పాత్రల కోసం సినిమా షూటింగ్ మొదలయ్యే 30రోజుల ముందే లండన్ లో ఆడిషన్స్ నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా ఆడిషన్స్ లో పాల్గొన్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక సినిమాలో కీలకమైన ఆ ఏడుగురి పాత్రలు తెరపై ఎలా ఆవిష్కరించారో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా సినిమాలో సరికొత్త ఫీల్ ని కలిగించనుంది. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ – సుదీప్ – విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించారు.


