బ్యాక్ టూ బ్యాక్ బాక్స్ ఆఫీస్ హిట్స్

0
7145

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సాహో బ్యూటీ మరోసారి తన స్టామినాను బయటపెట్టింది. వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె నుంచి ఇటీవల విడుదలైన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లతో న్యూ రికార్డ్ క్రియేట్ చేశాయి.

గత నెల 29న భారీ స్థాయిలో విడుదలైన సాహో సినిమా హిందీలో 150 కోట్లను దాటేసింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో శ్రద్ద పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇక సాహో విడుదలైన వారానికే ఛిచ్చోరె అనే సినిమాతో వచ్చిన శ్రద్దా ఆ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకుంది. దంగల్ దర్శకుడు నితీష్ తీవారి తెరకెక్కించిన ఛిచ్చోరె సినిమాలో శ్రద్దా సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కి జోడిగా కనిపించింది. మొత్తానికి ఆ సినిమా కూడా 125కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఈ విధంగా బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో శ్రద్ధ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here