గత ఏడాది సంచలన విజయం సాధించిన పాన్ ఇండియన్ మూవీ KGF ప్రస్తుతం సెకండ్ పార్ట్ తో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఛాప్టర్ 1 ఇచ్చిన కిక్కుతో సెకండ్ చాఫ్టర్ ని అంతకంటే హై రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ నేషనల్ లెవెల్లో యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫైనల్ గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా చిత్ర యూనిట్ తో కలిశాడు.
యష్ కథానాయకుడిగా నటిస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ఒక స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసింది. అప్పటి నుంచి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సంజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకమని సమాచారం. ఇక ఫైనల్ గా నేడు సంజయ్ షూటింగ్ లొకేషన్స్ లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం కె జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.