సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని ఎలా ఉన్నా ఒక్క మ్యూజిక్ డైరక్టర్ మాత్రం సినిమాలో ప్రతి సీన్ పై ఒక అవగాహన కలిగి ఉండాలి. డైరెక్టర్ ఆలోచనకు తగ్గట్టుగా పని చేస్తూనే సొంత టాలెంట్ ని మ్యూజిక్ తో బయటపెట్టాలి. అదే తరహాలో మిక్కీ జె మేయర్ కూడా కాలానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతున్నారు. గద్దల కొండ గణేష్ తో ఫుల్ మాస్ తరహాలో కూడా సాంగ్స్ క్రియేట్ చేయగలడని నిరూపించుకున్నాడు.
మొదటి నుంచి మిక్కీ సాఫ్ట్ ట్యూన్స్ అద్భుతంగా ఇవ్వగలడని ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. హ్యాపీ డేస్ – శతమానం భవతి – మహానటి వంటి సినిమాలకు తన డిఫరెంట్ మ్యూజిక్ ని అందించిన మిక్కీకి ఫుల్ కమర్షియల్ మాస్ సినిమాలకు వర్క్ చేసే అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఫైనల్ గా గద్దలకొండ గణేష్ తో తనలో కూడా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఆల్ రౌండర్ గా నిరూపించుకున్నాడు.
నాలుగు పాటలను ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా కంపోజ్ చేసి మాస్ ఆడియెన్స్ చేత విజిల్ వేయించాడు. ముఖ్యంగా ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ కి మంచి స్పందన వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.


