‘ట్రాప్‌ సిటీ’ తో జివి ప్రకాష్ హాలీవుడ్ ఎంట్రీ

0
646

రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా మ్యూజిక్ తో పాటు నటుడిగా కూడా తన మల్టి టాలెంట్ ను తెరపై ఆవిష్కరిస్తున్నాడు. ఇక నెక్స్ట్ హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు జీవి సిద్దమవుతున్నాడు.

బాలీవుడ్‌ దర్శకుడు నిక్కీ బ్రూచ్చల్‌ దర్శకత్వం వహించనున్న ‘ట్రాప్‌ సిటీ’అనే హాలీవుడ్‌ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా మొదలయ్యింది. ట్రాప్ సిటీ సినిమాను కైబా అనే హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. నెక్స్ట్ జీవి హీరోగా నటించిన 100% లవ్ రీమేక్ 100% కాదల్ విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here