కోలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసిన మేఘ ఆకాష్

0
831

లై సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్. గ్లామర్ తో ఒక్కసారిగా యువతను ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ తమిళ్ లో మెల్లమెల్లగా బిజీ అవుతోంది. తన అందంతో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. బేబీ నెక్స్ట్ తమిళనాడు సీనియర్ పొలిటీషియన్ స్టాలిన్ తనయుడి సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.

స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మొన్నటివరకు పాలిటిక్స్ తో కాస్త బిజీగా కనిపించాడు. ఇక చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు రాబోతున్నారు. త్వరలో మాగిజ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కినున్న రొమాంటిక్ లవ్ స్టోరీలో ఉదయనిధి నటించబోతున్నాడు. ఆ సినిమాలో లై పిల్ల మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇక బేబీ నటించిన ‘ఎన్నై నొక్కి పాయుమ్’ తోట రిలీజ్ కూ రెడీగా ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరక్కేక్కిన ఆ సినిమాలో ధనుష్ హీరో. అలాగే బాలీవుడ్ శాటిలైట్ శంకర్ సినిమా ద్వారా మేఘా బాలీవుడ్ కి పరిచయం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here