ఇస్మార్ట్ శంకర్ ఫుల్ వీడియో సాంగ్

0
795

మాస్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ లా కడుపు నింపిన మూవీ ఇస్మార్ట్ శంకర్. అయితే ఆ మూవీ లో సాంగ్స్ మంచి కిక్కిచ్చే కిళ్లీ లాంటివి. ఎలాంటి ఆడియెన్స్ అయినా ఆ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేసేలా మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక పూరి జగన్నాథ్ తన మార్క్ కి తగ్గట్టుగా కొరియోగ్రాఫర్స్ తో సాంగ్స్ ని డిజైన్ చేయించుకున్నారు. రామ్ ఎనర్జిటిక్ డాన్స్ తో సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు ఇక సినిమా రిలీజ్ అనంతరం ఫుల్ వీడియో సాంగ్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు చిత్ర యూనిట్ ఎండ్ కార్డ్ వేస్తోంది.

చార్ట్ బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. మొన్న రిలీజ్ చేసిన ధీమాక్ కారబ్ ఇప్పటికే 11 మిలియన్ల వ్యూవ్స్ తో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మాస్ సాంగ్ కూడా అంతకంటే హై రేంజ్ లో క్లిక్కవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ డిఫరెంట్ స్టైల్ కి తగ్గట్టుగా మణిశర్మ ఇచ్చిన బీట్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక చాందిని గా సభా నటేష్ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here