సాధారణంగా హీరోలు జిమ్ లో ఎలాంటి వర్కౌట్స్ చేస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ సుధీర్ బాబు మాత్రం ఎవరు ఊహించని విధంగా తారు రోడ్డుపై న్యాచురల్ గా కారును ముందుకు తోస్తు వర్కౌట్స్ చేశాడు. జిమ్ లో వర్కౌట్స్ చేయడం రొటీన్ అంటూ కోచ్ అలీ స్టీల్ ఈ విధంగా తన బ్యాట్ రైడర్ ని నెట్టమని చెప్పినట్లు సుధీర్ బాబు పేర్కొన్నాడు.
భారీ కారును ఒంటరిగా ముందుకు తోస్తు కనిపించిన ఈ హీరో మీ ఓట్లొ ఫ్యూయల్ కావాలంటే ఇలా కూడా చేయవచ్చు అంటూ సరదాగా మరో క్యాప్షన్ ఇచ్చాడు. ట్రైనర్ మాటలకు ఉద్వేగానికి లోనవుతూ సుదీర్ తన బలాన్ని మొత్తం చూపిస్తూ కారును ముందుకు నెడుతున్నాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇకపోతే సుధీర్ బాబు నాని కథానాయకుడిగా నటిస్తున్న V సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
#WorkoutWithYourCar 😛 Why should your workout week be routine and boring .. says my trainer #ZafarAli … So, he made it interesting by making me push my #Batrider 🦇😎. Add some fuel into your body and try to carry your car for sometime 😆 💪 #preparation #VTheFilm pic.twitter.com/DQ7ZBwisSW
— Sudheer Babu (@isudheerbabu) September 14, 2019


