అపరిచితుడు తరహాలో విక్రమ్ మరో ప్రయోగం

0
929

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన చియాన్ విక్రమ్ ఏ సినిమా చేసినా అందులో కొత్త తరహా క్యారెక్టర్స్ దర్శనమిస్తుంటాయి. కథలను ఎంచుకోవడంతోనే తన టాలెంట్ ను చూపించుకునే ఈ హీరో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. అది కూడా అపరిచితుడు తరహాలో సరికొత్త కిక్ ఇచ్చే విధంగా తెరకెక్కనుంది. ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేస్తోన్న విక్రమ్ రీసెంట్ గా మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘డిమాంట్‌ కాలనీ, ఇమైక్క నొడిగళ్‌’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు, విక్రమ్ ని ఒక వెరైటి కథతో మెప్పించాడు. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక సినిమాలో విక్రమ్ ఇమేజ్ కి తగ్గట్టుగా డిఫరెంట్ పాత్రలు ఉంటాయని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. ఓ విధంగా అపరిచితుడు రేంజ్ లో ఆకట్టుకుంటాయని కూడా చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చెన్నైలో స్టార్ట్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here