సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. 76 ఏళ్లయినా ఇంకా తన పాటలతో అలరిస్తూనే ఉన్నారు. ఆయన తనయులు యువన్ శంకర్ రాజా – కార్తిక్ రాజా.. ఇద్దరు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ గా వారికంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మాస్ట్రో రాజా వారసత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే ఇంతవరకు ఇళయరాజాతో యువన్ శంకర్ రాజాకి వర్క్ చేసే అవకాశం దక్కలేదు.
ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు. శీను రామస్వామి దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ‘మామనితన్’ అనే తమిళ్ డ్రామా సినిమాకు కలిసి సాంగ్స్ ని కంపోజ్ చేయబోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా నిర్మాతగా ఉన్నారు. కె ప్రొడక్షన్ తో కలిసి యువన్ తన YSR ప్రొడక్షన్ లో మామనితన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తన తండ్రితో మొదటిసారి కలిసి పని చేస్తున్న ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని యువన్ శంకర్ రాజా సోషల్ మీడియా ద్వారా చెప్పారు.


