ప్రముఖ నటుడు విశాల్ సినిమా పరిశ్రమకు ప్రవేశించి 15 ఏళ్ళు గడచిన సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఆ ఆనందాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఇక ఇటీవల మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తుప్పరివాలన్ 1 సినిమా తమిళ నాట మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇచ్చిన మంచి జోష్ తో, ఇటీవల మిస్కిన్ దర్శకత్వంలోనే తుప్పరివాలన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు విశాల్.
ఇకపోతే విశాల్ 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా మెయిస్ట్రో ఇళయరాజాను తీసుకుంటున్నట్లుగా ఆయనను కలిసిన సందర్భంగా విశాల్ ప్రకటించడం జరిగింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాను తెలుగులో డిటెక్టీవ్ పేరుతో రిలీజ్ చేయగా, తెలుగులో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది….!!