సల్మాన్ దబాంగ్ 3 మాస్ మోషన్ పోస్టర్

0
331

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ మరో దబాంగ్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో సల్మాన్ దబాంగ్ 3 మూవీని రిలీజ్ చేయనున్నాడు. ఇక సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సల్మాన్ మాస్ స్టైల్ లో అడుగులు వేస్తుండడం అభిమానులకు మంచి కిక్ ని ఇస్తోంది. ఇక బిగ్ స్క్రీన్ పై ఈ షాట్ పడితే నాన్ స్టాప్ విజిల్స్ పడాల్సిందే.

తమిళ్ మలయాళం కన్నడ తెలుగు భాషల్లో చుల్ బుల్ పాండే తనదైన శైలిలో అలరించడానికి డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారత్ సినిమా రిలీజ్ అనంతరం సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 రెగ్యులర్ షూట్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఎలాగైనా అనుకున్న తేదికి సినిమాను విడుదల చేయాలనీ దర్శకుడు ప్రభుదేవా పక్కా ప్లాన్ తో షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here