మల్లు స్టార్ మలయాళం టైటిల్ కూడా రెడీ!

0
641
Ala Vaikunthapuramulo First Look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగులో ఎలాంటి స్టార్ డమ్ ఉందొ అదే తరహాలో మలయాళం కూడా బన్నీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అల్లు హీరో ఎనర్జీకి అక్కడి జనాలు మల్లు స్టార్ అనే ఒక బ్రాండ్ కూడా సెట్ చేశారు. ఇకపోతే బన్నీ తదుపరి చిత్రం అలా.. వైకుంఠపురములో సినిమా మలయాళం భాషలో కూడా భారీగా రిలీజ్ కానుంది.

రీసెంట్ గా తెలుగు టైటిల్ ను ప్రకటించిన చిత్ర యూనిట్ “అంగు వైకుంతపురతు” అని మలయాళం టైటిల్ ను కూడా సెట్ చేసింది. రంగస్థలం – జై లవకుశ వంటి సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన సాహో సినిమాను కేరళలో రిలీజ్ చేసిన RD ఇల్యూమినేషన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకుంది. 2020 జనవరిలో తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్- చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here