అదరగొట్టిన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ లుక్ పోస్టర్….!!

0
452
Ala Vaikunthapuramulo First Look
Ala Vaikunthapuramulo First Look
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరికొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అల్లు అర్జున్ రోడ్ ప్రక్కన కార్ ఆపి, అక్కడున్న స్టూల్ పై కూర్చుంటే, ప్రక్కనున్న సెక్యూరిటీ గార్డ్, ఆయన సిగరెట్ కు నిప్పంటించడం గమనించవచ్చు. ఒకింత ఆసక్తికరంగా డిజైన్ చేయబడిన ఈ పోస్టర్, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీనియర్ నటి టబు, మురళి శర్మ, సుశాంత్, నివేత పేతురాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం థమన్, సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here