బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏదైనా ఒక విషయం నచ్చితే వెంటనే దాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సల్మాన్ ఖాన్ కొరడాతో సరదాగా కొట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషాలతో ఉన్న కొంతమందిని ఇటీవల కలుసుకున్న సల్మాన్ ఖాన్ వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.
అదే విధంగా కొరడాతో సరదాగా కొట్టుకుంటూ మీరు ఇలా ట్రై చేయకండి అలాగే ఎవరి మీద కూడా ప్రయోగం చేయవద్దని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఈ బాక్స్ ఆఫీస్ హీరో దబాంగ్ 3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.


