మరో ప్రయోగానికి సిద్దమవుతున్న నేషనల్ అవార్డ్ విన్నర్స్

0
764

గత ఏడాది అక్టోబర్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అంధాధూన్‌. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా విడుదలైన కొన్ని రోజులకే పాజిటివ్ టాక్ తో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో ఆయుష్మాన్‌ ఖురానా కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బెస్ట్ హీరో – బెస్ట్ మూవీ విభాగాల్లో ఇటీవల నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అయితే మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ క్లారిటీ ఇచ్చాడు. అందుకు సంబందించిన కథ రెడీగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్‌ బాలీవుడ్ లో బిజీగా ఉన్నాడని చెప్పిన శ్రీరామ్ అతని కమిట్మెంట్స్ కి ఎండ్ కార్డ్ పడిన తరువాత తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వివరణ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here