ఎవరు చిత్రాన్ని అభినందించిన సూపర్ స్టార్ మహేష్ …!!

0
193
Mahesh Babu About Evaru

యువ నటుడు మరియు రచయితైన అడివి శేష్ నటించి, రచించిన కొత్త చిత్రం ఎవరు. ఈ సినిమా ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో, హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా, పివిపి సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మించింది. ఇక ఇప్పటికే అటు ప్రేక్షకులతో పాటు, పలువురు సినిమా ప్రముఖుల నుండి సైతం ప్రశంశలు అందుకుంటున్న ఈ సినిమాపై నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు కురిపించారు.

ఎవరు సినిమా చూడటం జరిగింది, థ్రిల్లర్ కథాంశంతో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా యూనిట్ కి, అలానే అడివి శేష్ కు ప్రత్యకంగా అభినందనలు తెలుపుతూ మహేష్ ట్వీట్ చేయడం జరిగింది. మీ ఎంకరేజిమెంట్ కు చాలా పెద్ద థాంక్స్ సర్, ఇది మా సినిమాకు ఎంతో గొప్ప గౌరవం, త్వరలో మీ సారథ్యంలో పని చేయనున్న మేజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ అడివి శేష్, మహేష్ బాబు ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రిప్లై ఇవ్వడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here