పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న వరుణ్ తేజ్ వాల్మీకి….సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్…!!

0
110
Valmiki Post production

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. తమిళ్ లో ఇటీవల రిలీజ్ అయి, మంచి సక్సెస్ సాధించిన జిగార్తాండ మూవీకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి మాస్ కమర్షియల్ పంథాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అలానే జర్ర జర్ర లిరికల్ మరియు వీడియో ప్రోమో సాంగ్ కు వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో, వాల్మీకి టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ తో కలిసి దిగిన ఒక ఫోటోను, దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. తమిళ నటుడు అధర్వ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అయనాంక బోస్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను, వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here