స్టార్ హీరోయిన్ ఆటో రైడ్

0
182
Kiara Advani Auto Ride

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్ తో భరత్ అనే నేను తర్వాత ఈ హాట్ గర్ల్ లక్కు ఒక్కసారిగా మారిపోయింది. హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ తో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. అయితే స్టార్ డమ్ ఒక రేంజ్ లో ఉన్న సమయంలో కియారా ఆటోలో షూటింగ్ కి వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ముంబై విధుల్లో సాధారణ మహిళగా ఆటోలో కూర్చొని కియారా నవ్వుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పక్కన కొరియోగ్రాఫర్‌ షబినా ఖాన్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here