1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న’వాల్మీకి’ ‘జర్ర జర్ర’ వీడియో ప్రోమో సాంగ్…!!

0
615

టాలీవుడ్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్మీకి. గబ్బర్ సింగ్, డీజే సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సారథ్యంలో రూపొందిన ‘జర్ర జర్ర’ అనే సాంగ్ వీడియో ప్రోమోని రెండు రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది.

వరుణ్ తేజ్, అధర్వ పై చిత్రీకరించిన ఈ మాస్ ప్రత్యేక గీతాన్ని అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా అద్భుతంగా పాడారు. ఇక ఈ సాంగ్ లో హీరోయిన్ డింపుల్ హయతి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. మాంచి మాస్ స్టైల్ లో సాగిన ఈ సాంగ్, రేపు సినిమా రిలీజ్ తరువాత యూత్, మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుందని వీడియో ప్రోమోని బట్టి చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక అతి త్వరలో నిర్వహించి, సినిమాను వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here