టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఈ నెల 30న గ్రాండ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ పనుల్లో చిత్ర నిర్మాతలు బిజీగా ఉండగా కథానాయకుడు ప్రభాస్, శ్రద్దా కపూర్ రెగ్యులర్ ప్రమోషన్స్ తో సినిమాకి మంచి క్రేజ్ తెస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ పనులు కూడా ముగిశాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్ గురించి అనేక విషయాలు చెప్పిన ప్రభాస్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
ప్రీ క్లయిమ్యాక్స్ లో వచ్చే ఆ యాక్షన్ సీన్స్ అభిమానులకు సరికొత్త థ్రిల్ ని ఇస్తాయని మునుపెన్నడు వెండితెరపై చూడని సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ప్రభాస్ చెప్పారు. సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా తెలుగు,హిందీ, తమిళ్,మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. యూవీ క్రియేషన్స్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.


