డిఫరెంట్ రోల్స్ అయితేనే ఒప్పుకుంటా: ఇస్మార్ట్ బ్యూటీ

0
529

నన్ను దోచుకుందువటే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్మార్ట్ బ్యూటీ నభా నటేష్. మొదటి సినిమాకు రెండవ సినిమాకు ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ నభా నటేష్ మాత్రం ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ లో దర్శనమిచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. ఆ సినిమా కమర్షియల్ గానే కాకుండా నభా నటనకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది.

అయితే కెరీర్ లో క్లిక్కవ్వలంటే మనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ ఉండాలని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. నేను చేసే సినిమాలు గత సినిమాల క్యారెక్టర్స్ లా ఉండకూడదని జాగ్రత్తగా కథలను ఎంచుకుంటానని చెబుతోంది. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటిగా కూడా డిఫరెంట్ రోల్స్ లో కనిపించలని నాభ ఆశపడుతోంది. ఇక నెక్స్ట్ డిస్కో రాజాలో కూడా మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు ఇస్మార్ట్ బ్యూటీ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here