యూట్యూబ్ లో10 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ‘సైరా’ టీజర్….!!

0
652

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదిస్తోంది. తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్, ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ప్రధానాకర్షణగా సాగిన ఈ టీజర్, అద్భుతమైన విజువల్స్, పవర్ఫుల్ డైలాగ్స్ మరియు భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో రూపొందడం జరిగింది.

మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తుండగా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతి బాబు, రవి కిషన్, తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా పాటలను అతి త్వరలో రిలీజ్ చేసి, సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సినిమా యూనిట్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here