నేషనల్ అవార్డ్ గెలిచిన కథ కోసం 20 కేజీలు తగ్గిన సీనియర్ హీరో

0
597

గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన అంధాదున్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడమే కాకుండా మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులను గెలుచుకుంది. దీంతో సినిమా రీమేక్ రైట్స్ పై ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది. తీవ్రమైన పోటీ నడుమ ఇటీవల తమిళ్ రైట్స్ ను సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన త్యాగరాజన్ శివనందం దక్కించుకున్నారు.

ఇక తమిళ్ అంధాదున్ లో బ్లైండ్ హీరో పాత్రలో కనిపించబోయేది సీనియర్ హీరో అయిన తన తనయుడు ప్రశాంత్ అని త్యాగరాజన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రశాంత్ సినిమాలో పాత్రకు తగ్గట్టు మారడానికి చాలా కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది సంక్రాంతి కి రిలీజైన వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ప్రశాంత్ ఇప్పుడు అంధాదున్ సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గినట్లు త్యాగరాజన్ చెప్పారు. వీలైనంత త్వరగా సినిమా యూనిట్ ని సెట్ చేసుకొని సినిమాను స్టార్ట్ చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here