కింగ్‌నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘మన్మథుడు 2‘. నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) నిర్మాతలు. ఆగస్ట్ 9నప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ…
మన్మథుడు 2 లో మీ క్యారెక్టర్ గురించి?
– నా పాత్ర పేరు అవంతిక. నా పాత్రకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. చాలా ఫన్ ఉండే పాత్ర నాది. పాత్రలో మంచి ఎనర్జీ ఉంటుంది. ఫన్‌తో మంచి మెచ్యూరిటీ కూడా ఉంది. నాటీగా, స్టైలిష్‌గా కనపడే పాత్ర. ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. సాంగ్స్, సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్ర కాదు. శామ్, అవంతిక పాత్రల మధ్య ప్రధానంగా నడిచే కథ ఇది. మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్. సినిమా ఎలా పూర్తయ్యిందో కూడా తెలియదు. సినిమాలోని అందరితో మంచి అనుబంధం ఏర్పడింది.
నాగార్జున గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
– నాగార్జునగారు మంచి సపోర్ట్ కోస్టార్. సెక్యూర్ యాక్టర్. కొన్ని సీన్స్‌లో హీరోయిజంని పట్టించుకోకుండా కథకు ఏమీ అవసరమో దానికే ఆయన ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్. అందుకొక ఉదాహరణ చెప్పాలంటే ఓ సాంగ్ షూట్‌లో ఆయన ఉన్న ప్లేస్‌కు లొకేషన్ గంట వ్యవధి పట్టేంత దూరంలో ఉంది. మిగిలిన యూనిట్ నాలుగు గంటలు వ్యవధి పట్టేంత దూరంలో లొకేషన్ ఉంది. విషయం తెలుసుకున్న నాగార్జునగారు.. అదేంటి? అలా ఎందుకు? నేను కూడా అందరితో పాటు ట్రావెల్ చేస్తానంటూ మాతో పాటు స్టే చేశారు.
రాహుల్ రవీంద్రన్ మేకింగ్ స్టైల్ గురించి?
– రాహుల్ నాకు `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమా నుండే తెలుసు. తను నా రాకీ బ్రదర్. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. మంచి రైటర్. చాలా క్లారిటీ ఉన్న పర్సన్. ప్రీ ప్రొడక్షన్‌ను పక్కాగా చేసుకున్నారు. షూటింగ్ వెళ్లడానికి నెల ముందే నాకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాను. నాకే కాదు.. అందులోని నటీనటులందరికీ స్క్రిప్ట్ ఇవ్వడంతో నటించడం చాలా సులభమైంది. సెట్2లో ఎంత పనిచేసినా హ్యాపీగా, పాజిటివ్ వైబ్స్‌తో ఉంటారు. అందరినీ ఓ మూడ్‌లోకి తీసుకొచ్చి నటింప చేశారు. నా పాత్రను అద్భుతంగా రాశారు. నాతో పాటు ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
ఈ సినిమాలో మీది బోల్డ్ నెస్ కి దగ్గరగా ఉండే పాత్రలా ఉంది?
– సిగరెట్ తాగితేనే బోల్డ్ నెస్ కాదు. అలాగే సినిమాలో నేను సిగరెట్ తాగలేదు. అవంతిక పాత్ర సిగరెట్ తాగింది. `అవంతిక పొగతాగుతుంది.. నాగార్జునగారికి ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారనే` విషయాన్ని సినిమాలో హైలైట్ చేయలేదు. సినిమాలో భాగంగానే చూపించాం. మన సోసైటీలో చాలా జరుగుతున్నాయి. కానీ బయట చెప్పాలనుకున్నప్పుడు సమాజం ఏమనుకుంటుందోమోనని ఆలోచిస్తుంటాం. అవంతిక పాత్ర సిగరెట్ తాగడం గురించి కాదు కదా.. ఓ స్ట్రాంగ్ ఎమోషన్ గురించి చెప్పడానికి చేసిన సినిమా ఇది.
నాగార్జున గారి మన్మథుడు మూవీ చూశారా?
– నేను సైన్ చేసిన తర్వాతే నాగార్జునగారి `మన్మథుడు` సినిమా చూశాను. అలాగే `మన్మథుడు 2` ఫ్రెంచ్ సినిమా రీమేక్. ఆ ఫ్రెంచ్ సినిమాను కూడా నేను చూడలేదు. చాలా మార్పులు చేర్పులు చేశారు. రీమేక్ చేసేటప్పుడు మాతృకను చూస్తే ఎక్కడో రిజిష్టర్ అయిపోతుందని చూడలేదు.
దేదేప్యార్‌దే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?
– దేదేప్యార్‌దే` సినిమా తెలుగులో రీమేక్‌లో నేను నటించడం లేదు. నన్నెవరూ అడగలేదు. అయినా సేమ్ మూవీలో అదే పాత్రలో నటిస్తే కిక్ ఉండదు.అలాగని నేను రీమేక్‌లకు వ్యతిరేకం కాదు.
నాగార్జున, అజయ్‌దేవఘన్, ఇలా ఎక్కువ మంది సీనియర్ యాక్లర్లతోనే నటిస్తున్నారు కదా? జూనియర్ హీరోస్ తో అవకాశాలు తగ్గుతాయేమో ?
– సీనియర్ హీరోలతో నటిస్తే జూనియర్ హీరోల సరసన అవకాశాలు రావని అనుకోను. ఎందుకంటే అజయ్ దేవగణ్‌గారితో నటించిన తర్వాత సిద్ధార్థ్‌తో నటించాను. తెలుగులో నాగార్జునగారితో నటించాను. ఇప్పుడు నితిన్‌తో నటించబోతున్నాను. రెండు, మూడేళ్లుగా సినీ ఇండస్ట్రీ మారుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ రకుల్ ప్రీత్..