యంగ్ హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రణరంగం చిత్రంలోని ఇతర నటులు,సాంకేతికనిపుణులు,యూనిట్ సభ్యులు ఈ ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా…
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ…“కాకినాడకు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూడగానే కొత్తగా ఉంది. ఈ సినిమాకు అదే ఫస్ట్ సక్సెస్ అనుకున్నాను. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను బాగా తీసాడు. చాలా టైం తీసుకొని రీసెర్చ్ చెయ్యడం జరిగింది. ప్రస్థానం సినిమా చూసినప్పుడు శర్వలో ఆర్టిస్ట్ కనిపించాడు. ఈ సినిమాలో మరింత బాగా నటించాడు. హీరోయిన్స్ ఇద్దరూ బాగా కనిపిస్తున్నారు. రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ…“తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడలో ఈ చిత్ర షూటింగ్ కోసం వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం సంతోషంగా ఉంది. కెమెరామెన్ దివాకర్ వర్క్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను త్రివిక్రమ్ గారికి ఫ్యాన్ ని ఆయన ఈ చిత్ర ట్రైలర్ రేలీస్ చెయ్యడం ఆనందంగా ఉంది. శర్వాతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి“అన్నారు.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ…సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్న. శర్వా ఈ సినిమాను మంచి ఎనిర్జీ తో చేసాడు. త్రివిక్రమ్ గారికి థాంక్స్ మాకు సపోర్ట్ చేస్తునందుకు. నేను చెప్పదలుచుకున్న విషయాలు సినిమాలో చెప్పాను. రణరంగం మీ అందరిని అలరిస్తుంది భావిస్తున్న’అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ…’కాకినాడలో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ చేసాను, మర్చిపోలేని అనుభూతి నాకు. నేను ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్ పోర్ట్ లో కలిశాను. చాలా ప్రేమగా పలకరించారు. ఆయన సింప్లిసిటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. త్రివిక్రమ్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్న. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి’ అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
Ranarangam (Sharwanand, Kajal Agarwal, Kalyani Priyadarshan) Trailer Launch – Pics