‘మన్మథుడు’ లాగానే ‘మన్మథుడు 2’ను కూడా అంతే బాగా ఎంజాయ్‌ చేశాను – కింగ్‌ నాగార్జున

0
657

కింగ్‌ నాగార్జున టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో విడుదలైన ‘మన్మథుడు’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి తరహాలోనే డిఫరెంట్‌గా.. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మన్మథుడు 2’ నాగార్జున కెరీర్‌లో ఈ చిత్రం ఓ మెమొరబుల్‌ మూవీ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ను ఈ రోజు జులై(25) హైదరాబాద్‌ ఆర్‌.కె సినిప్లెక్స్‌ లో కింగ్‌ నాగార్జున, వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ అందారి సంయుక్తంగా విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా…

వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ అందారి మాట్లాడుతూ – ”ఈ ఏడాది హిందీలో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ఓ తెలుగు సినిమా. త్వరలోనే హిందీలో మరో తెలుగు సినిమా కూడా పెద్ద మూవీగా నిలవబోతుంది. ఇక్కడే ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్‌ను ఎక్కువ ప్యాషన్‌తో ప్రేమిస్తారు. అందుకనే హాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరున్న వయాకామ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మన్మథుడు 2 కామెడీ ఎంటర్‌టైనర్‌. నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ బంధాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలనుకుంటున్నాను. టైమ్‌లెస్‌ హీరో కింగ్‌ నాగార్జునగారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను” అన్నారు.

డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ – ”మన్మథుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత ప్రేమించారో నాకు తెలుసు. ఇప్పుడు అదే రకమైన సపోర్ట్‌ను ఎదురుచూస్తున్నాను. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో తెలియదు లేదు. త్వరగా పూర్తయ్యింది. ఫస్ట్‌ కాపీని చూశాం. అందరం ఎంజాయ్‌ చేశాం. రేపు ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు” అన్నారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ అసోసియేట్‌ కావడం ఇదే తొలిసారి. ఏ ప్రాబ్లెమ్‌ లేకుండా సినిమా చాలా చక్కగా పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరూ హ్యాపీగా ఉండాలనే ప్లాన్‌తోనే ఈ సినిమా ముందు నుండి ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నాం. ప్రొడక్షన్‌ కాస్ట్‌, సేల్‌ రేట్స్‌ అన్ని అందరూ హ్యాపీగా ఫీలయ్యేలానే ప్లాన్‌ చేశాం. త్వరలోనే మన్మథుడు జర్నీ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మన్మథుడు వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మన్మథుడు 2 వచ్చింది. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌భాస్కర్‌గారితో చేసిన మన్మథుడు చాలా ఈజీగా, సాఫీగా ఎలా సాగిందో.. ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. ఆ సినిమాకు ఇది ఈక్వెల్‌గా ఉంటుందనే నా ధీమా. ” అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ…

మన్మథుడుకి ఈ సినిమా సీక్వెలా?
నాగార్జున: మన్మథుడు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించలేదు. ఆ క్యారెక్టర్స్‌కు, కథకు ఎక్కడా సంబంధం లేదు. అయితే జోనర్‌ మాత్రం రొమాంటిక్‌ కామెడీ. ‘ఊపిరి’ సినిమాను ‘అన్‌టచ్‌బుల్స్‌’ అనే సినిమాను బేస్‌ చేసుకుని, రైట్స్‌ కొనుక్కుని రీమేక్‌ చేశాం. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే.. కేవా మూవీస్‌ నుండి గీత ఏడాదిన్నర క్రితం ఓ ఫ్రెంచ్‌ మూవీను తీసుకొచ్చి మీరు చేస్తే బావుంటుందని చెప్పింది. ఆ సినిమా నేను చూశాను. బాగా నచ్చడంతో ఆ సినిమా హక్కులను కొని దానిపై ఏదాడి పాటు వర్క్‌ చేసి సినిమా చేశాం. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది.

సమంతతో పనిచేయడం ఎలా అనిపించింది?
నాగార్జున: సమంతతో పనిచేయడం నాకేమీ కొత్తేమి కాదు. సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. తనతో ఇప్పటికే మనం, రాజుగారిగది 2 సినిమాలు చేశాను. తను కోడలైన తర్వాత మరింత కేర్‌ తీసుకుంటున్నాను.

ట్రైలర్‌లో వేరే భాషలో డైలాగ్‌ చెప్పినట్లున్నారుగా?
నాగార్జున: అది పోర్చుగల్‌ భాష. దాని గురించి బిగ్‌బాస్‌లో ఎక్స్‌ప్లెయిన్‌ చేశాను. సినిమా నెటివిటీ ప్రకారం కొన్ని పదాలను ఉపయోగించాను.

‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ను పెట్టాలని సినిమా ప్రారంభానికి ముందే అనుకున్నారా?
రాహుల్‌ రవీంద్రన్‌: ఈ సినిమాకు మన్మథుడు కరెక్ట్‌ టైటిల్‌. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది. నాగ్‌సారే చేస్తున్నారు కాబట్టి. మన్మథుడు 2 అని పెట్టాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో సెటిలైన తెలుగు ఫ్యామిలీ కథ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎంజాయ్‌ చేసేలా సినిమా క్లాస్‌గా ఉంటుంది.

సమంత పాత్ర ఎలా ఉంటుంది?
రాహుల్‌ రవీంద్రన్‌: సమంతగారి చిన్న అతిథి పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆమెను ఎందుకు నటింప చేశాననేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

బిగ్‌బాస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారా?
నాగార్జున: చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. 15 నిమిషాల ముందు వరకు కంటెస్టెంట్స్‌ ఎవరనేది నాకు కూడా తెలియదు. ఇదే విషయం ఇంట్లో వాళ్లకి చెప్పినా నమ్మలేదు. కానీ అదే నిజం. ఈసారి తెలంగాణ హైకోర్టు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈసీజన్‌కు తమ వంతు సపోర్ట్‌ చేస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్షింపబడతారు.

బెస్ట్‌ ట్యాక్స్‌ పేయర్‌గా అవార్డు తీసుకున్నారుగా?
నాగార్జున: చాలా సంతోషంగా ఉంది.ట్యాక్స్‌ ఏ మేర సేవ్‌ చేయాలో చేసుకుని, మిగతా దానికి నా వంతు ట్యాక్స్‌ను పే చేసేస్తున్నాను. అప్పుడే నేను హ్యాపీగా నిద్రపోగలను.

Manmadhudu 2 Trailer Launch – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here