అంచనాలు పెంచిన సాహో యాక్షన్ పోస్టర్…..!!

1
234

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ సాహో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాక ఈ సినిమా నుండి విడుదలైన సైకో సయ్యా సాంగ్ కూడా యూత్ ని ఎంతో అలరిస్తోంది. ఇక టీజర్, మరియు సాంగ్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. కాసేపటి క్రితం ఈ సినిమాలోని హీరో, హీరోయిన్లు పాల్గొన్న ఒక ప్రధాన యాక్షన్ సన్నివేశానికి సంబందించిన పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేసారు చిత్ర నిర్మాతలు.

ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా ఉంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, మురళి శర్మ, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, ఎవెలిన్ శర్మ, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

Saaho Action Poster

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here