టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ శ్రీనివాస్ గారి పెద్ద తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా నటించిన తోలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో కెరీర్ పరంగా శ్రీనివాస్ కు మెల్లగా అవకాశాలు రాసాగాయి. ఇక అప్పటినుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీనివాస్, ఇప్పటివరకు అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత తదితర ఆరు సినిమాల్లో నటించి, నేటితో సక్సెఫుల్ గా 5 ఏళ్ళ సినిమా కెరీర్ ని పూర్తి చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా తన తొలిచిత్ర దర్శకులు వివి వినాయక్, అలానే తన తండ్రి గారైన బెల్లంకొండ సురేష్ మరియు కొందరు ఇతర సినిమా ప్రముఖుల సమక్షంలో శ్రీనివాస్ నేడు కేక్ కట్ చేసి 5ఏళ్ళ సినీ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన వారందరూ, శ్రీనివాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెఫుల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ అభినందలు తెలిపారు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ నటించిన కొత్త చిత్రం రాక్షసుడు ఆగష్టు 2న విడుదలకు సిద్దమయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో క్రైమ్, యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఏ స్టూడియోస్ పతాకంపై హీరో హవీశ్ ప్రొడక్షన్స్ తో కలిసి కోనేరు సత్యనారాయణ నిర్మించారు….!!


