కం బ్యాక్ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ ని సాధించి, తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక దాని తరువాత ప్రస్తుతం అయన నటిస్తున్న కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి. రాయలసీమకు చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ వ్యయంతో మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు డీవోపీగా పనిచేస్తున్న రత్నవేలు సినిమా అద్భుతంగా వస్తోంది అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం మెగాస్థార్ గారు హీరోగా రూపొందుతున్న సైరా సినిమా చాలా బాగా వస్తోంది, నైట్ ఎఫెక్ట్ లో ఎంతో ఛాలెంజింగ్ గా చిత్రీకరించిన యాక్షన్ సీన్ డిఐ పూర్తయిందని , సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. రేపు విడుదల తరువాత ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా నిలవడం ఖాయం అంటూ, అయన పోస్ట్ చేయడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు…!!