ట్విట్టర్లో వరల్డ్ వైడ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండైన “బిగ్ బాస్-3” తెలుగు…..!!

0
195

కింగ్ నాగార్జున హోస్ట్ గా నిన్న ఎన్నో అంచనాల మధ్య మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మంచి రేటింగ్స్ తో సక్సెస్ ని సాధించినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే గత రెండు సీజన్లకు హోస్టులుగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, మరియు నాని, షోను మరింత సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇక నాగార్జున హోస్ట్ గా నిన్న ప్రారంభమైన షోలో 15మంది పార్టిసిపెంట్స్ ను వీక్షకులకు పరిచయం చేయడం జరిగింది. ఇక ట్విట్టర్లో ఈ షో వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్టులో టాప్ ప్లేస్ ని దక్కించుకుందంటే షోకి రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే విషయాన్ని కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

నిన్న రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 3 వరల్డ్ వైడ్ నెంబర్ వన్ స్థానంతో ట్రెడింగులోకి రావడం సంతోషంగా ఉందంటూ అయన ట్వీట్ చేశారు. ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మున్ముందు ఈ షో మరింత సక్సెస్ అవడం ఖాయమని అంటున్నారు షో నిర్వాహకులు. ఇక ఈ షోలో కంటెస్టెంట్లుగా వి6 ఛానల్ సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, టివి9 జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు. కాగా, నేటి నుంచి ఎలిమినేషన్ నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. తొలివారం నామినేషన్ల లిస్టులో జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్ లాంటివారు ఉండటం విశేషం. ఇకపోతే నేటి నుంచి ఈ షో మరింత రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here