గ్రాండ్ గా జరిగిన సితార బర్త్ డే సెలెబ్రేషన్స్…..!!

0
134

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార జన్మించి నిన్నటితో ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇక ఆమె 7వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్టమనేని అభిమానులు ఊరూరా సామజిక, సేవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇకపోతే నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు మరియు అతిథుల సమక్షంలో సితార జన్మదినాన్ని ఎంతో వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు మహేష్ దంపతులతో పాటు గౌతమ్, దర్శకులు అనిల్ రావిపూడి, రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్, డీవోపీ రత్నవేలు, కోటి పరుచూరి, దర్శకులు వంశీ పైడిపల్లి దంపతులు మరియు ఆయన కుమార్తె ఆద్య సహా మరికొందరు పాల్గొన్నారు.

తమ జీవితంలోకి సితార రాక ఎంతో ఆనందదాయకమని, ఆమె ఇలానే మరిన్ని పుట్టినరోజులు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, అలానే ఎల్లప్పుడూ ఆమెకు ఆ భగవంతుడి చల్లని దీవెనలు అందించాలని కోరుకుంటూ నిన్న మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సితారకు బర్త్ డే విషెస్ తెలుపడం జరిగింది. ప్రస్తుతం సితార బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here