ఈ తెలుగు హీరోయిన్ ని గుర్తుపట్టండి..

0
258

ఈ ఫొటోలోని హీరోయిన్ ని గుర్తుపట్టారా?.. ఎత్తుపళ్లు, చేతిలో పిజ్జాతో కాస్త విచిత్రంగా ఉన్న ఈమె ఎవరో కాదు. తాజాగా ‘కల్కి’ సినిమాలో నటించిన నటి అదా శర్మ. అదా శర్మ తాజాగా ట్విటర్‌లో ఈ ఫొటోను షేర్ చేశారు. ‘ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నది ఆమేనని నెటిజన్లు గుర్తు పట్టేశారు. ‘నువ్వు ఎంత మేకప్‌ వేసినా మేం గుర్తు పట్టగలం, నువ్వే..’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకీ అదా శర్మ ఈ లుక్‌లో ఎందుకు తయారయ్యారో చెప్పలేదు.

ఇది ఎదో సినిమాకు సంబందించిన లుక్ లా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. చూడాలి మరి అదా ఈ ఫోటో గురించి ఏంచెబుతారో. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హిందీలో ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ సందడి చేస్తున్నారు. మొదటిసారి ‘ది హాలిడే’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here