టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతున్న మంచి క్రేజీ మూవీస్ లో కింగ్ నాగార్జున నటిస్తున్న మన్మధుడు-2 మూవీ కూడా ఒకటి. కొన్నేళ్ల క్రితం విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తరువాత యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. నాగార్జున సరసన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ జోడి కడుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల విడుదలై వీక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక నిన్న ఈ సినిమాలో హీరోయిన్ గా అవంతిక క్యారెక్టర్ లో నటిస్తున్న రకుల్ ప్రీత్ ఇంట్రడక్షన్ టీజర్ యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. నిన్నటినుండి విపరీతమైన వీక్షకుల అభిమానంతో ఈ టీజర్ ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో 60 వేలకు పైగా లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నిజానికి ఈ టీజర్ లో రకుల్ రెండు రకాల విభిన్న షేడ్స్ ఉన్న అమ్మాయిగా కనపడడం, అలానే ఎంతో బోల్డ్ గా ఆమె పలికే డైలాగులు మరియు యాక్టింగ్ యూత్, లేడీస్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!


