‘దొరసాని’ “నింగిలోన పాలపుంత” వీడియో సాంగ్ విడుదల

0
523

యువ నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తొలిసారి తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా దొరసాని. ఈ సినిమాతోనే ప్రముఖ నటులు రాజశేఖర్ మరియు జీవిత గార్ల చిన్న కుమార్తె శివాత్మిక కూడా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరి కలయికలో ప్రస్తుతం రూపొందుతున్న ఈ దొరసాని సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ కు వీక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మొన్న జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, మూవీ మంచి సక్సెస్ అవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేయడం జరిగింది.

తొలి సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆనంద్ మరియు శివాత్మిక ఎంతో పరిణితి చెందిన యాక్టర్స్ లాగా ఎంతో అద్భుతంగా నటించారని యూనిట్ అంటోంది.  ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే మంచి సక్సెస్ సాధించగా, నేడు ఈ సినిమాలోని ‘నింగిలోన పాలపుంత’ ఫుల్ వీడియో సాంగ్ ని సినిమా యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ నేపధ్యాన్ని సహజంగా చూపిస్తూ పాట ఆకట్టుకుంటోంది.

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మాతలుగా మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్ల ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here