“సరిలేరు నీకెవ్వరు” లో ‘మేజర్ అజయ్ కృష్ణ’గా సూపర్ స్టార్ మహేష్

0
474

సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆయన తదుపరి సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. అపజయమెరుగని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కాశ్మీర్ లో ప్రారంభం అయింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా, పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ మేజర్ ‘అజయ్ కృష్ణ’ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు .

మేజర్ అజయ్ కృష్ణ పేరుతో ఉన్న నేమ్ ట్యాగ్ తో ఆర్మీ యూనిఫామ్ ని అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు . ఒక్కడు, దూకుడు లో అజయ్ గా, పోకిరి లో కృష్ణమనోహర్ గా కనిపించిన మహేష్ బాబు ఇందులో అజయ్ కృష్ణ గా కనిపిస్తుండడం విశేషం.  టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు,దిల్ రాజు, అనిల్ సుంకర,  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు …..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here