‘రాజావారు రాణిగారు’ టీజర్ పై సినీ ప్రముఖుల ప్రశంసలు …..!!

0
69

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొద్దిరోజులుగా యువ నటీనటులు రావడం, తొలి సినిమాలతోనే మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం ఎక్కువగా జరుగుతోంది. ఇక ఆ విధంగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న నూతన జంట, కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌ నటిస్తున్న కొత్త సినిమా రాజావారు రాణిగారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ముగ్గురు యువకులు వారి జీవితాలను అద్దంపడుతూ, దానితోపాటు హృద్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబడుతోంది.

ఒక బుర్రకథ మాదిరిగా ప్రారంభమయ్యే ఈ సినిమా టీజర్ లో, ఓ పల్లెటూరులో రేషన్‌ డీలర్‌ కుమార్తెతో ఆర్‌ఎంపీ డాక్టర్‌ కుమారుడు ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు సహాయం చేసిందేవరు? ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు మనకు అర్ధం అవుతుంది. టీజర్ విడుదల తరువాత తమ సినిమా పై అంచనాలు పెరగడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ పై కొందరు ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు.

ప్రముఖ దర్శకులు సుకుమార్, బ్రోచేవారెవరురా చిత్ర దర్శకులు వివేక్ ఆత్రేయ, నటులు అడివి శేష్, నారా రోహిత్ తదితరులు ఈ టీజర్ అద్భుతంగా ఉంది, తప్పకుండా రేపు విడుదల తరువాత సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలి అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ‘రాజావారు రాణిగారు’ సినిమా టీమ్ కు విషెస్ తెలియచేయడం జరిగింది. ఈ సినిమాను ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.మనోవికాస్‌ నిర్మిస్తుండగా, రవికిరణ్‌ కోల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here